Pages

Saturday, May 2, 2009

కాటుక కంటినీరు.... బమ్మెర పోతన

పద్యం:
కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్యమర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓ
హాటకగర్భురాణి! నిను ఆకటికై కొనిపోయి అల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ.
టీక:
కాటుక కంటినీరు = కాటుక కళ్ళలోనుండి నీరు
చనుకట్టు పయింబడ = చనులమీద పడునట్లు
యేల ఏడ్చెదో = ఎందుకేడుస్తావమ్మా,
కైటభ దైత్య మర్దనుని = కైటభుడు అనే రాక్షసుడ్ని చంపినవాని కోడలా,
ఓ మదంబ = ఓ నా తల్లీ,
ఓ హాటకగర్భురాణీ = ఓ హిరణ్యగర్భుని (బ్రహ్మ) భార్యా,
నిను = నిన్ను
ఆకటికై = (నా) ఆకలి తీర్చుకోడానికి
కొనిపోయి = తీసుకెళ్ళి
అల్ల = ఆ
కర్నాట కిరాట కీచకుల కమ్మ = కన్నడ రాక్షసులకి అమ్మివేయను
త్రిశుద్ధిగ = త్రికరణ శుద్ధిగా (మనసా, వాచా, కర్మణా)
నమ్ము భారతీ = సరస్వతీ దేవీ, నన్ను నమ్ము.

తా కైటభుడ్ని చంపిన మహావిహ్ణువుకి ప్రియమైన కోడలివీ,  హిరణ్యగర్భుడనబడే బ్రహ్మకి భార్యవీ అయిన ఓ సరస్వతీ దేవీ, నీ కాటుక కళ్ళలోనుండి గుండెలమీదకి నీళ్ళు కారేటట్లు ఎందుకలా దుఃఖిస్తావు? నా ఆకలి తీర్చుకునే నెపంతో నిన్ను తీసుకెళ్ళి రాక్షసులవంటి ఆ కన్నడరాజులకి అమ్మనని త్రికరణశుద్ధిగా నే చెప్పే మాట నమ్మవమ్మా భారతీ.

No comments:

Post a Comment