Pages

Saturday, April 14, 2012

జన గణ మన

King George V 1911 లో సతీ
(Queen Mary) సమేతంగా భారతదేశానికి వచ్చినప్పుడు
చక్రవర్తి వచ్చాడు కదా
అని అధికారులూ, అనధికారులూ,
మంత్రులూ, సామంతులూ, సంస్థానాధీశులూ,
ఇంకా ఇతరులూ చాలా
హడావిడి చేశారు. ఆస్పత్రులు
కట్టించారు. (ఉదా: KGH Hospital, Vizag), వ్యాసరచన, వక్తృత్వ
పోటీలు నిర్వహించేరు. ఇంత
హడావిడి జరుగుతూంటే కవులూరుకుంటారా!
అసలే మన సాంప్రదాయంలో
రాజంటే స్వయంగా విష్ణువు
కూడానూ. వాళ్ళూ కవితలల్లేరు.
కావ్యాలు వ్రాశారు.పద్యాలు
చెప్పేరు. గేయాలు వినిపించేరు.
అదిగో, ఆ సందర్భంలో
విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌
వ్రాసిన గేయమే, మన
ప్రస్తుత జాతీయగీతమైన జన
గణ మన....... మరి
ఎప్పట్నించో మన జాతియగీతమనుకున్న
బంకింబాబు వందేమాతరం వదిలేసి
ఒక వలస ప్రభుత్వ
రాజుగారినుద్దేశించి ఒక బాంచను
కవి అల్లిన పదాలని
జాతీయగీతంగా ఎందుకు తీసుకోవలసొచ్చిందో
పరిశీలిద్దాం.

ఐదవ జార్జి చక్రవర్తి రాక
సందర్భంగా ఠాగూరుగారు రచించిన
గేయాన్ని తత్వబోథిని పత్రిక
వారు తమ జనవరి
1912 సంచికలో ప్రచురించారు. విశ్వకవి
కూర్చిన పదాలపొందికకి అందఱూ
ముచ్చటపడ్డారూ, మెచ్చుకున్నారూనూ. అలాగ ఈ
గేయం జనామోదం పొందింది.
ఇలా కొంతకాలం గడచిన
తరువాత 1919 లో కవిగారు
మన మదనపల్లె Theosophical Society వారి college ని
సందర్శించిన సందర్భంలో అక్కడ
hostel లోబస చేశారు. ఆ
college principal గారి భార్య శ్రీమతి
Margaret Cousins మంచి సంగీతకారిణే
కాకుండా, ఠాగూరు గారి
fan కూడా. ఆవిడ ఠాగూరుగారి
జనగణమన గేయాన్ని చక్కగా
స్వరపరిచి (ఇప్పుడు మనకి
తెలిసిన వరసలో) కవిగారికి
వినిపించి ఆయనని మెప్పించారు.
ఆ బాణీ దేశంలో
మంచి ప్రాచుర్యం పొందింది.

ఇలా ఉండగా 1947 లో దేశానికి
స్వాతంత్య్రమొచ్చింది. ఆ తర్వాత
ఒకానొక ఐరాస సమావేశానికి
భారతదేశ ప్రతినిథులు కొందరు
వెళ్ళగా, వారిని ఐక్యరాజ్య
సమితిలో వాళ్ళెవరో "మీదేశ జాతీయగీతం
మాకు వినిపించగలరా !" అని అడిగారు.
అప్పటికి మన రాజ్యాంగమింకా
అమలులోకి రానందువల్ల అధికారికంగా
జాతీయగీతమంటూ ఏదీ ప్రకటింపబడలేదు
కానీ అందరూ అనుకున్నది
మాత్రం వందేమాతరమనే. అయితే,
మన ప్రతినిథులు తమ
దేశానికి జాతీయగీతమంటూ అధికారికంగా
లేదని చెప్పడానికి సిగ్గు
పడ్డారేమో, తమ దగ్గరున్న
జన గణమన రికార్డు
(instrumental) వేసి వినిపించారు. అందరూ
చాలా శ్రావ్యమైన గీతమని
మెచ్చుకున్నారు. సరే ప్రపంచానికి
నచ్చింది కదా అని,
అదే మన జాతీయగీతం
చేసింది నెహ్రూ ప్రభుత్వం.
వందేమాతరానికి సమాన ప్రతిపత్తి
ఉంటుందన్నారనుకోండీ, కానీ అది
వేరే విషయం.

ఇప్పుడు దీని
తాత్పర్యం చూద్దాం.

జనగణమన అధినాయక జయహే
భారతభాగ్య విథాతా!

ప్రజలకీ,వారి
మనస్సులకీ మార్గదర్శకుడవైన భారతదేశ
భవిష్యత్తు నిర్ణయించే వాడా,
నీకు జయము.

పంజాబ సింధు గుజరాత
మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా
గంగా ఉచ్ఛ జలధి తరంగా
తవ శుభనామే
జాగే తవ శుభ
ఆశిశ మాగే
గాహే తవ జయ
గాథా

పంజాబు, సింథు,
గుజరాతు, మహారాష్త్ర, తమిళనాడు,
ఒరిస్సా, బెంగాలూ మొదలగు
రాష్త్రాలూ (తెలుగు వారిని
నందమూరి తారక రాముడు
ముఖ్యమంత్రి అయేంతవరకూ ఎవడూ
పట్టించుకోలేదు), వింధ్య, హిమాచలం
వంటి పర్వతాలూ, గంగా
యమునల్లాంటి నదులూ, ఉవ్వెత్తున
ఎగసే సముద్ర తరంగాలూ,
అనీ కూడా నీ
పేరునే తలుస్తున్నాయి. నీ
శుభాశీస్సులే కోరుతున్నాయి. నీ
విజయగాథలనే కీర్తిస్తున్నాయి.

జనగణమంగళ దాయక జయహే
భారతభాగ్యవిథాతా
జయహే జయహే జయహే
జయ జయ జయ
జయహే!

జనావళికంతా శుభం
చేకూర్చేవాడా, నీకు జయం,
జయం, జయం.

చూశారా మరి!
మనకి దొరల పాలనంటే
ఎంత ఇష్టమో! ఇప్పటికీ
వాళ్ళకి జయం పలుకుతున్నాం.

2 comments:

  1. sir, meeru post chesina matterlo dravida ante andhra, tamila, karnataka, kerala kuda kalisthayemo ... alage mana country future mana medhe aadharapadindhi ante aa chakravarthi maname kada..

    ReplyDelete
  2. జగదీశ్‌ గారూ,
    మనదేశ ప్రగతి, భవిష్యత్తు ఇప్పుడు మనమీదే ఆధారపడింది కాబట్టి ఈ పాటలో చక్రవర్తులం మనమే అనుకుని తృప్తి పడడంలో తప్పు లేదు. ఈ బ్లాగు పోస్టు చేయడంలో నా ఉద్దేశ్యం మన జాతీయగీతం యొక్క పూర్వాపరాలు నాకు తెలినంతలో వివరించడమే. అయితే దీన్నే మన జాతీయగీతంగా పెట్టుకోవడం ఎంతవరకూ సబబో ఆలోచించ వలసిన విషయం.

    ReplyDelete